విదేశాలకు భరత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ ఇటీవల విడుదలై ఏకంగా వంద కోట్ల మార్కెట్‌ను కొల్లగొట్టింది. తమిళ , తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం అటు తమిళంలో కూడా మహేశ్‌కి మంచి ఓపెనింగ్స్‌ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘్భరత్ అను నేను..’చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం వేసిన అసెంబ్లీ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా షూటింగ్‌కు బ్రేక్ పడ్డట్టు తెలుస్తోంది. దానికి కారణం మహేశ్ ఫ్యామిలీతోకలిసి విదేశీ యాత్రలో వున్నాడు. ఈ నెల 6నుంచి మరో షెడ్యూల్‌ని రోమ్‌లో ప్రారంభిస్తారట. మహేశ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఖైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని తెలిసింది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.