‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటై 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ‘మా’ టీమ్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ చేతుల మీదుగా మెమొంటోలు అందజేశారు.
ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం ఓ చారిటీ క్రికెట్ కోసం విశాఖపట్నం నుంచి నేను, చిరంజీవి తిరిగి వస్తుండగా మనకంటూ ఒక అసోసియేషన్ వుంటే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు పుట్టిందే ‘మా’. ఈ అసోసియేషన్ ద్వారా ఎంతోమంది కళాకారులు పలు విధాలుగా లబ్ధిపొందేలా చేసాం. ‘మా’ పదవుల్లో కొనసాగిన ప్రతి ఒక్కరూ ఆ పదవికి మరింత కళను తీసుకువచ్చారు. ఈసారి అధ్యక్షులుగా వున్న శివాజీ రాజా ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగడం ఆనందంగా వుంది. ఈ పండగను మనందరం ఘనంగా జరుపుకుందాం అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ ‘మా’ అసోసియేషన్ ఏర్పడి పాతికేళ్లు అయిన సందర్భంగా ఆనందంగా వుంది, ఇప్పటికే చాలామందికి ఎన్నోరకాలుగా సహాయం అందించాం, సిల్వర్ జూబ్లీ వేడుకల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, మోహన్‌బాబు మెంబర్స్‌గా వుండడానికి అంగీకరించారు, నాగార్జున తన స్టూడియోను ఉచితంగా వినియోగించుకోమని అనుమతి ఇచ్చారు, ఈరోజు నుంచి 30వ తేదీ వరకు మెంబర్ షిప్ డ్రైవ్ చేపడుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డి, పరుచూరి బ్రదర్స్, బెనర్జీ, హేమ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పరుచూరి బ్రదర్స్, ఎస్వీ కృష్ణారెడ్డి, శివాజీ రాజా, మురళీమోహన్, హేమ, సుమన్ తదితరులు