27న ఉన్నది ఒకటే జిందగీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన మిత్రుడని నమ్మే యువకుడు అభిరామ్. నలుగురు స్నేహితులతో కలిసి రాక్ బ్యాండ్ ను ప్రారంభిస్తాడు. ఆ రాక్ బ్యాండ్‌కి అతనే లీడర్. చిన్నప్పటి నుంచి హాపీగా వెళ్తోన్న అలాంటి అభిరామ్ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఆ అమ్మాయిల్లో ఎవరితో అభిరామ్ ప్రేమలో పడ్డాడు? ఇంతకీ అభిరామ్ కథేంటి? అనేది మా చిత్రంలో చూపిస్తామంటున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. యువతరం క్రేజీ స్టార్ రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి కథానాయికలు. ‘స్రవంతి’ రవికిషోర్, పి.ఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ- ‘‘ఇటలీలో రామ్‌పై చిత్రీకరించిన సన్నివేశాలతో చిత్రం మొత్తం పూర్తయింది. ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో రామ్ అద్భుతంగా నటించాడు. కిశోర్ కథ, కథనం, దర్శకత్వం..ప్రతిదీ కొత్త పంథాలో ఉంటుంది. రామ్, కిశోర్ తిరుమల కలయికలో మేం నిర్మించిన ‘నేను శైలజ’ తరహాలో ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని నమోదుచేసుకుంటుందన్న నమ్మకం వుంది. ఈ చిత్రానికి సంబంధించి త్వరలో పాటలను విడుదల చేసి ఈనెల 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం’’ అన్నారు.