ప్రేమలో పందెం కడితే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎం.అర్జున్ దర్శకత్వంలో శ్రవణ్, మీనాక్షి గోస్వామి జంటగా ఎం.లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పందెం’. ఈ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ- చాలా ఆసక్తి కలిగించే కథ ఇది. ముఖ్యంగా హీరోయిన్ మీనాక్షి అద్భుతంగా నటించింది. ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇందులో జబర్దస్త్ వినోద్‌ను మగవాడి గెటప్‌లోనే చూపిస్తున్నాం. నన్ను నమ్మి సినిమా నిర్మిస్తున్న లక్ష్మీనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ- గతంలో నేను జర్నలిస్టుగా ఐదేళ్లు పనిచేశాను. దర్శకుడు అర్జున్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను. క్వాలిటీ విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది అన్నారు.