అడ్వెంచర్‌ల రాజరథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డు నామినేషన్ అందుకున్న అనూప్ భండారి దర్శకత్వంలో తెలుగు సినిమా తెరకెక్కిస్తున్నాడు. జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. నిరూప్ భండారి, అవంతికా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నా రు. అజయ్ రెడ్డి నిర్మా త. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- రొమాంటిక్ కామెడీతోపాటు అడ్వెంచరస్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. యూనిక్ సబ్జెక్టుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాము. దానికి తగ్గట్టుగా దర్శకుడు అనూప్ భండారి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆయన గతంలో రంగీ తరంగా చిత్రానికి దర్శకత్వం వహించాడు. అది సంచలన విజయం సాధించడమే కాకుండా ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాల్లో స్థానం పొందడం విశేషం అన్నారు. ఈ చిత్రంలో ఆరు పాటలున్నాయి. స్టైలిష్ లుక్‌తో అద్భుతంగా తెరకెక్కిన చిత్రమదని, హీరో హీరోయిన్లు చక్కగా నటించారని అనూప్ భండారి తెలియజేశారు.