బ్రహ్మానందంకు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని సియాటెల్ నగరంలో ఈనెల 6న జరగబోయే తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోమని ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, వెయ్యి చిత్రాలతో గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసిన డా. బ్రహ్మానందంకి ఆహ్వానం అందింది. ఇదే వేదికపై ఈనెల 7న యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందంను ఘనంగా సత్కరించనుంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ గౌరవాన్ని పొందిన రెండో నటుడు ఎస్వీ రంగారావు తర్వాత బ్రహ్మానందం మాత్రమే. 1864 జకార్తా చిత్రోత్సవాల్లో ‘నర్తనశాల’ చిత్రోత్సవానికి గాను ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్‌గా ఎస్వీఆర్ అవార్డు పొందిన తర్వాత తిరిగి ఇనే్నళ్లకు ఒక తెలుగు నటుడి విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం ముదావహం. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రపం చ వ్యాప్తంగా తెలుగు కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రస్తుతం ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగ్ నిమిత్తం అమెరికాలోనే షూటింగ్‌లో వున్న బ్రహ్మానందం ఈ ఆహ్వానానికి అంగీకరాం తెలిపారు.