ప్రత్యేక పాటలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా అల్లు అర్జున్ సరసన డీజే (దువ్వాడ జగన్నాథమ్) సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు ఐటెం గర్ల్‌గా మారేందుకు సిద్ధమైంది. తాజాగా మరో మెగా హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోంది ఈ బ్యూటీ. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రం హైదరాబాద్‌లో వేసిన విలేజ్ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారని, ఈ పాట చేయడానికి పూజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. ‘ఒక లైలాకోసం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజ, ఆ తరువాత బాలీవుడ్‌లో కూడా మెరిసింది. ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఈమె, గ్లామర్ విషయంలో అందరికంటే ముందే వుంటుంది. మరి ఈ ఐటెం సాంగ్‌తో పూజ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి!