లవర్‌బాయ్స్‌తో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంబ, యోధ, కిరణ్, పావని ముఖ్యపాత్రల్లో వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రాజ్యలక్ష్మి, సి.నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘లావణ్య విత్ లవర్‌బాయ్స్’. ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్లాటినమ్స్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రమిది. అమ్మాయి అంతరంగాన్ని తెలుసుకొని ప్రేమించాలి. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తూనే వుంటుంది. గొప్ప సందేశంతో చిత్రాన్ని తెరకెక్కించాం. యువతరంతోపాటు కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- యువతరం మనోభావాలకు దర్పణం పట్టే చిత్రమిది. అందమైన ప్రేమకథతో అలరిస్తుంది. అద్భుతంగా పాటలు ఉన్నాయి. ఇప్పటికే యశోకృష్ణ అందించిన పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తప్పకుండా సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.