‘బాలకృష్ణుడు’ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలక్షణ నటుడు నారా రోహిత్ హీరోగా శరశ్చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయాబజార్ మూవీస్ పతాకాలపై దర్శకుడు పవన్ మల్లెల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘బాలకృష్ణుడు’. బి.మహేందర్‌బాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ట్రైలర్, పాటలను ఈనెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాతలు బి.మహేందర్‌బాబు, ముసునూరు వంశీ, శ్రీవినోద్ నందమూరి మాట్లాడుతూ- నారా రోహిత్ గత చిత్రాలకు భిన్నంగా ‘బాలకృష్ణుడు’ యాక్షన్, రొమాన్స్, అద్భుతమైన పాటలు ఇలా అన్ని కమర్షియల్ హంగులతో కంప్లీట్ కమర్షియల్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమాకోసం తొలిసారి నారా రోహిత్ సిక్స్‌ప్యాక్ చేయడం విశేషం. పవన్ మల్లెల సినిమాను పక్కా కమర్షియల్ చిత్రంగా అద్భుతంగా తెరకెక్కించారు. పృథ్వీ, వెనె్నల కిశోర్, రఘుబాబు కామెడీ ట్రాక్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. మణిశర్మ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. రమ్యకృష్ణ ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం ఆడియోను ఈనెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, పృధ్వీ, ఆదిత్యమీనన్, కోట శ్రీనివాసరావు, దీక్షాపంత్, పియా బాజ్‌పాయ్, అజయ్, తేజస్విని, శ్రావ్యారెడ్డి, వెనె్నల కిశోర్, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు:కొలుసు రాజా, మ్యూజక్:మణిశర్మ, కెమెరా:విజయ్ సి.కుమార్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: మహేంద్రబాబు, ముసునూరి వంశీ, దర్శకత్వం: పవన్ మల్లెల.