ఎమోషనల్‌గా ఆకట్టుకునే ఓయ్ నినే్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరత్ మార్గాని, సృష్ఠి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓయ్ నినే్న’. ఈ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు భరత్ మార్గాని. ఈ చిత్రం రేపు విడుదలవుతున్న సందర్భంగా భరత్ చెప్పిన విశేషాలు.. మా స్వస్థలం రాజమండ్రి. కానీ నా స్కూల్ విద్య అంతా ఊటీలో సాగింది. తరువాత హైదరాబాద్, యుఎస్‌ఎలో స్టడీ పూర్తిచేశా. మాకు కన్‌స్ట్రక్షన్ బిజినెస్‌తోపాటు చేపల చెరువులున్నాయి. కాలేజీ చదివే టేమ్‌లో మోడలింగ్ చేశాను. సినిమాలంటే ఆసక్తి వుంది. ఆ సమయంలో ఓ ప్యాషన్ వీక్‌లో జడ్జిగా వ్యవహరిస్తున్న నన్ను నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ చూసి ఈ సినిమాకు ఎంపిక చేశారు. ఆ తరువాత సత్యానంద్ వద్ద యాక్టింగ్ నేర్చుకున్నా. షార్ట్ఫిలిమ్ కూడా చేశాను. ఈ చిత్రంలో విష్ణు అనే పాత్రలో కన్పిస్తాను. ముక్కుసూటి తత్త్వమున్న యువకుడు, ఎప్పుడూ తండ్రిచే తిట్టు తింటూ ఉంటాడు. ఆ తరుణంలో చదువుకోవడానికి మా ఇంటికి వచ్చిన మరదలితో మొదట్లో అస్సలు పడదు. ఆ తరువాత మా మధ్య ప్రేమ చిగురిస్తుంది. అప్పుడు ఏం జరిగింది అనే అంశాలతో తెరకెక్కిన కథ ఇది. ఎమోషనల్ అంశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. టైటిల్ కూడా బాగా నచ్చింది. పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఈ సినిమా తరువాత ఓ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తాను. త్వరలోనే దాని వివరాలు తెలియజేస్తా అన్నారు.