మోహన్‌బాబుకు డాక్టరేట్ ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు, విద్యావేత్త అయిన డా.మోహన్‌బాబుకు ఎం.జి.ఆర్ యూనివర్శిటీ వారు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. చెన్నైలో బుధవారం అత్యంత వైభవంగా జరిగిన విశ్వవిద్యాలయం 26వ స్నాతకోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్‌రావు చేతుల మీదుగా మోహన్‌బాబు ఈ డాక్టరేట్‌ను అందుకున్నారు. మోహన్‌బాబు ప్రముఖ నటుడేగాక, విద్యావేత్త, పార్లమెంటేరియన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత అని ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. సాటిలేని డైలాగ్ డెలివరితో చిత్రసీమలో తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకున్నారని, నాలుగు దశాబ్దాలుగా విస్తరించిన ఆయన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు వారి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. తన 40 ఏళ్ల కెరీర్‌లో 560కి పైగా సినిమాల్లో నటించిన మోహన్‌బాబు వైవిధ్యమైన పాత్రల్లో జీవించారు. ఈ డాక్టరేట్ మోహన్‌బాబు సినీ ప్రస్థానంలో మరో మైలురాయి. మోహన్‌బాబును ఇది వరకే అమెరికాలోని ప్రసిద్ధ యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు సినిమా, విద్య రంగాల్లో కృషికి గాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు.
2007లో ఆయనను భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో గౌరవించింది. నటుడిగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న మోహన్‌బాబుకు గత ఏడాది బ్రిటీష్ పార్లమెంట్‌లో బ్రిటన్‌లోని ప్రముఖ భారతీయ వార్తా పత్రిక అయిన ‘ఏషియన్ లైట్’ వారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం జరిగింది. అదే కార్యక్రమంలో ఆయనను ‘ప్రనామ్’ అనే అవార్డుతో సత్కరించి, ఆయన చిత్రాలలోని ఉత్తమ డైలాగులను ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. మోహన్‌బాబు తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌పై ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు నిర్మించారు. తాజాగా ఆయన నటించి నిర్మిస్తున్న ‘గాయత్రి’ అనే చిత్రం షూటింగ్‌తో బిజీగా వున్నారు. మోహన్‌బాబు రాజ్యసభ ఎంపిగా కూడా పనిచేశారు. ఆయన స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌లో కె.జి నుండి పి.జి దాకా ఇరవై వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యానికేతన్ భారతదేశంలోనే ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా పేరుగాంచింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందిస్తూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదిస్తుంది. అంతేకాకుండా 25 శాతం విద్యార్థులకు వారి ఆర్థిక స్థోమత ప్రాతిపదికన కుల మతాలకు అతీతంగా ఉచిత విద్యను అందిస్తోంది విద్యానికేతన్. డాక్టరేట్ అందుకున్న మోహన్‌బాబుకు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు అందజేశారు.