ఆర్మీ అధికారిగా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రం విజయంతో జోరుమీదున్నాడు ఎన్టీఆర్. ఏకంగా మూడు పాత్రలు పోషించి ఔరా..! అనిపించాడు. ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరిమధ్య కథా చర్చలు కూడా జరిగాయని తెలిసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్‌కళ్యాణ్‌తో చేస్తున్న సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది. పవన్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నారు. నవంబర్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నదని, ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ కూడా సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఆసక్తి రేపుతోంది. అదేమిటంటే, ఇందులో ఎన్టీఆర్ ఆర్మీ అధికారిగా కనిపిస్తాడని, దానికోసం ఆయన విదేశాల్లో ట్రైనింగ్ తీసుకుంటాడని తెలిసింది. వచ్చేవారంలో ఎన్టీఆర్ విదేశాలకు పయనమవుతున్నాడట. ఏదేమైనా దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వచ్చేవరకూ ఏది నిజమో.. ఏది కాదో అన్నది చెప్పలేం.