సంచలన పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో విద్యాబాలన్ అంటే ప్రత్యేక క్రేజ్. డర్టీ పిక్చర్ సినిమాకు ముందు విద్యాబాలన్ వేరు, ఆ చిత్రం తరువాత విద్యాబాలన్ వేరు. డర్టీపిక్చర్‌తో ఒక్కసారిగా సంచలన నటిగా మారిన ఆమె, ఆ తరువాత పలు సంచలనాత్మక చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. ఈమధ్యే బేగం జనా పేరుతో తెరకెక్కిన చిత్రంలో ఓ వ్యభిచార నిర్వాహకురాలిగా నటించి సంచలనం రేపింది. ఆ సంచలనం మరవకముం దే మరోసారి దుమ్మురేపడానికి సిద్ధమైంది. ప్రస్తుతం విద్యాబాలన్ ముఖ్యపాత్రలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈసారి ఆమె నటించే పాత్ర ఏమిటో తెలుసా? లెస్బియన్ నేపథ్యం లో ఉంటుంది. ముగ్గురు యువతుల మధ్య జరిగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం సాగుతుందట. ఓ హాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కనుందని టాక్. త్వరలోనే షూటింగ్ మొదలుకానుందట. మరో ఇద్దరు హీరోయిన్‌లను త్వరలోనే ఎంపిక చేస్తారట. మరి లెస్బియన్ పాత్రలో విద్యాబాలన్ ఏ రేంజ్‌లో దుమారం రేపుతుందో చూడాలి!