చేరువైన మనం సైతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మనం సైతం..’ సంస్థ సహాయ కార్యక్రమాలు మరింత విస్తృతం కానున్నాయి. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇద్దరు ఆపన్నులకు సహాయాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ నిర్మాత సి.కల్యాణ్, చాంబర్ అధ్యక్షుడు పి.కిరణ్, నటి సన, అమ్మిరాజు, బందరు బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందుల్లో వున్న కాస్ట్యూమర్ ఏడుకొండలు, ప్రొడక్షన్ మేనేజర్ రమేష్‌బాబు తనయుడు కేశవ్ మణిశంకర్ చదువుకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ- సహాయం కోసం ఎదురుచూసేవాళ్లు మన చుట్టూనే ఉన్నారు. అలాంటివాళ్లకోసం ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ల అవసరాన్ని తీర్చగలుగుతాం. కష్టాల్లో వున్న కొంతమందికైనా సాయపడాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థను ఏర్పాటుచేశాం. మాకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ- కిరణ్‌ను చూస్తుంటే ఆయనకంటే మంచి స్థాయిలో వున్న మేము ఎందుకిలాంటి కార్యక్రమాలు చేయడంలేదనే ఆలోచన వస్తుంది. అయినా మనం సైతం కార్యక్రమంలో భాగస్వాములమవుతాం అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ- ఎప్పుడూ సాటివాళ్ల గురించి ఆలోచించే కాదంబరి కిరణ్ ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేశారు.