పూరితో సునీల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టార్ కమెడియన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న సునీల్‌కు ఈమధ్య వరుసగా సినిమాలు పరాజయం పాలవుతూ టెన్షన్ పెడుతున్నాయి. కాస్త బ్రేక్ తీసుకుని తర్వాత చేసిన కృష్ణాష్టమి, వీడు గోల్డ్ ఎహే, జక్కన్న, తాజాగా ఉంగరాల రాంబాబు సినిమాలతో కమర్షియల్ విజయానికి దూరమైన సునీల్, మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా సునీల్‌తో సినిమా చేయడానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం ఆసక్తిగొలిపే విషయం ఇదే. ఈమధ్యే బాలకృష్ణతో ‘పైసా వసూల్’ చిత్రాన్ని తెరకెక్కించిన పూరి, తదుపరి చిత్రంగా ఆయన తనయుడు ఆకాష్‌తో ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమా తరువాత ఆయన సునీల్‌తో చేస్తాడని వినికిడి. ఓ మంచి కామెడీ సబ్జెక్ట్‌ను రెడీ చేశాడని, దానికి సునీల్‌ను హీరోగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో సునీల్ సినిమా చేశాడంటే నిజంగా అది అతని కెరీర్‌కు మంచి ఊపునిస్తుందని చెప్పాలి. మరి దీని గురించి అధికారిక వివరాలు వచ్చేవరకూ ఆగాల్సిందే.