నాగచైతన్య -సమంతల పెళ్లిసందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి గురువారం ముందుగా అనుకున్నట్లుగానే హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాగచైతన్య ను పెళ్లికొడుకు చేసిన ఫొటోలను నాగార్జున, హీరో వెంకటేష్‌లు తమ ట్విట్టర్‌ద్వారా పోస్ట్ చేసి తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అల్లుడి పెళ్లి కొడుకు ఫంక్షన్ లో దిగిన ఫొటోలో నాగచైతన్యతో పాటు వెంకటేశ్ తన ఆనందాన్ని నాగార్జునతో పంచుకున్నారు. వరుడి గెటప్‌లో నాగచైతన్యను చూపి అందరూ ముచ్చటపడిపోయారు. ఇక పెళ్లికి నెల రోజుల ముందు నుంచే సమంత వెడ్డింగ్ ఫొటో షూట్ తీయించి ఫొటోలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరుగుతున్న పెళ్లికి నాగచైతన్య, సమంత కుటుంబాలతో కలిపి కేవలం వంద మం ది మాత్రమే హాజరయ్యారు. శనివారం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరగనుంది. ఇది ఇలా వుండగా నాగార్జున కొడుకు పెళ్లి సందర్భంగా ఎంతో హుషారుగా కనిపించారు. తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ తన కోడలు సమంత మరికొన్ని గంటల్లో వచ్చేస్తోందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కోడలు సమంతతో దిగిన ఫొటోను కూడా షేర్ చేసి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తారు. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారట.