బాలీవుడ్ దర్శకుడు కుందన్ షా కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత బాలీవుడ్ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత కుందన్‌షా (69) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం తెల్లవారు జామున ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో తన నివాసంలోనే నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ‘జానే భీ దో యారో’, ‘కభీ హా కభీ నా’లాంటి చిత్రాలు ఆయన దర్శక్వంలో రూపుదిద్దుకొని మంచి పేరుని తెచ్చిపెట్టాయి. షా మృతిని ఆయన కూతురు ధ్రువీకరించారు. ‘నుక్కద్’, ‘వగ్లే కి దునియా’లాంటి టీవీ సీరియళ్లను కూడా ఆయన రూపొందించారు. 2014లో విడుదలైన ‘పీ సే పీఎం తక్’ చిత్రానికి ఆయన చివరి సారిగా దర్శకత్వం వహించారు. బాలీవుడ్ హాస్య చిత్రాల్లో వ్యంగ్య హాస్య శైలిని ప్రవేశపెట్టిన షా హిందీ చిత్రసీమలో తనదైన ముద్రను వేశారు. ‘జానే భీ దో యారో’ చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. అయితే దేశంలో పెరిగిపోతున్న అసహనానికి నిరసనగా, అలాగే ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు మద్దతుగా 2015 నవంబర్‌లో 23 మంది దర్శకులతో కలిసి కుందన్‌షా తన జాతీయ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. బాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. 1993లో షారుఖ్‌ఖాన్ నటించిన ‘కబీ హా కభీ నా’ తెరకెక్కించిన చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఆ చిత్రం షారుఖ్‌ఖాన్ నట విశ్వరూపాన్ని చూపించింది. 1984లో దూరదర్శన్‌లో బాగా పాపులరైన కామెడీ సీరిస్ ‘యహ్ జో హై జిందగీ’కు కుందన్‌షా దర్శకత్వం వహించారు. ‘క్యా కహెనా’ (2000), ‘హమ్ తో మొహబ్బత్ కరేగా’ (2000), ‘దిల్ హై తుమ్హారా’ (2002), ‘ఏక్ సే బడ్‌కర్ ఏక్’ (2004), ‘పీ సే పీఎం తక్’ (2014) చిత్రాలు ఆయనకు విశేష పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. కుందన్‌షా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘దర్శకుడుగా కుందన్‌షా బాలీవుడ్‌లో మరపురాని చిత్రాలను అందించారని, తనదైన శైలిలో రూపొందిన చిత్రాలను ప్రేక్షకులు ఎన్నటికీ మరచిపోలేరు. షా మరణం బాలీవుడ్‌కు తీరని మనోవ్యథను మిగిల్చింది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ షా కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుందన్‌షా మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ- బాలీవుడ్ దర్శకుడు కుందన్‌షా తనదైన ముద్రను కనబరిచారని అన్నారు.