ఫస్ట్‌లుక్ దీపావళికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ఇటీవల ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్‌ను జరుపుకుంది. తాజాగా విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అక్కడే వుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా మొదలై చాలా రోజులవుతున్నా కూడా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించకపోవడం కాస్త నిరాశకు గురి చేస్తోంది. త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారట. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌పై రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. దేవుడే దిగివచ్చినా, ఇంజనీర్‌బాబు వంటి టైటిల్స్ ప్రచారంలో వుండగా తాజాగా మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. అదే అజ్ఞాతవాసి. ప్రస్తుతం ఈ టైటిల్‌నే యూనిట్ ఓకే చేసేలా ఉందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఏదిఏమైనా ఫస్ట్‌లుక్ మాత్రం దీపావళికి విడుదల చేసి జనవరి 10న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.