కన్నడంలో చేయను?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ అందాల భామ శృతి హాసన్ ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించుకుంది. ప్రస్తుతం సౌత్‌లో మంచి క్రేజ్ వున్న టైమ్‌లో ఆమె కొత్త సినిమాలను అంగీకరించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలగాలని ఆశపడుతున్న శృతికి అక్కడ నిరాశలే ఎదురవుతున్నాయి. తాజాగా విడుదలైన బెహన్ హోగీ తేరీ సినిమా కూడా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో పలు అవకాశాలు వస్తున్నా కూడా శృతి ఓకే చెప్పడం లేదు. తాజాగా ఆమె కన్నడంలో ఎన్నటికీ సినిమాలు చేయనని చెప్పడం ఆసక్తిని రేపుతోంది. దానికి కారణం తాజాగా కన్నడంలో ధృవ సర్జ హీరోగా నటించే సినిమా కోసం శృతిని అడిగారని, దానికోసం ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని సదరు నిర్మాతలు ఇవ్వడానికి ఓకె చెప్పడంతో కన్నడ సినిమా చేయడానికి సిద్ధమైందంటూ కోలీవుడ్‌లో తెగ ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలిసిన శృతి స్పందించింది. అసలు తనను ఏ కన్నడ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదని, కన్నడంలో ఇప్పుడే కాదు, జీవిత కాలంలో ఎప్పుడూ నటించనని ఖరాఖండిగా చెప్పేసింది. మొత్తానికి కన్నడ సినిమా విషయంలో శృతి నిర్ణయం షాక్ ఇస్తోంది.

చిత్రం..శృతి హాసన్