యదార్థ సంఘటనల మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంకా ప్రొడషన్స్ పతాకంపై సూర్య తేజ, సాయి దన్సిక, ఆలీ, సోనీ చరిష్టా, మంజు ప్రధాన పాత్ర ల్లో కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో సతీష్ కొంకా నిర్మించిన చిత్రం మేళ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో ఆదివారం విడుదల చేసా రు. ఈ కార్యక్రమంలో నటుడు ఆలీ మాట్లాడుతూ ‘కబాలి’ చిత్రంలో దన్సిక అదరగొట్టిన సంగతి తెలిసిందే. తను నటిగానే కాకుండా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది, ఈ చిత్రంలో మంచి పాత్ర చేసింది అన్నారు. హీరోయిన్ దన్సిక మాట్లాడుతూ ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం, దర్శకుడు కథ చెప్పినపుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను, నా కెరీర్‌లో భిన్నమైన సినిమా ఇది, తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. హీరో సూర్యతేజ మాట్లాడుతూ వినాయకుడు, శంభో శివ శంభో, అప్పుడలా ఇప్పుడిలా సినిమాల తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది, కథను నమ్మి చేసిన సినిమా దర్శకుడు కిరణ్ అద్భుతంగా తెరకెక్కించాడు, త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేస్తాం, ఇలాంటి స్క్రిప్ట్ ఇండియాలో ఇప్పటివరకు రాలేదు అన్నారు. దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ నిర్మాత ఇచ్చిన సహకారంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం, సినిమా బాగా వచ్చింది, యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, కెమెరా: మురళీమోహన్‌రెడ్డి, ఎడిటింగ్: చంద్రవౌళి, నిర్మాత: సంతోష్ కొంక, దర్శకత్వం: కిరణ్ శ్రీపురం.