దుబాయ్‌లో ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో చిత్రానికి సీక్వెల్‌గా రోబో 2.0 చిత్రం తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ నెల 27న దుబాయ్‌లో పాటలను విడుదల చేస్తున్న సందర్భంగా లైకా క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం వివరాలు తెలియజేస్తూ రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న మరో అద్భుతమైన సినిమా ఇది, ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ విలువలతో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోంది, ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియో సంచలనం రేపింది, ఈనెల 27న దుబాయ్‌లో ఆడియో వేడుక జరపనున్నాం, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 25న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం అన్నారు. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఎ.ఆర్.రెహమాన్, కెమెరా: నిరౌషా, ఎడిటింగ్: ఆంథోనీ, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, దర్శకత్వం: శంకర్.