ఊటీలో సూర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమాన్యుయల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. గత నెల 24నుండి అక్కడ చిత్రీకరిస్తున్నారు.ఇదివరకే హైదరాబాద్‌లో రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ ఊటీలో ఈనెల 10 వరకు జరగనుంది. అ తరువాత షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరుపుతారట. అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కనిపించే ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేక శిక్షణ అమెరికా ట్రైనర్స్ వద్ద తీసుకుంటున్నాడు. అర్జున్, శరత్‌కుమార్‌లు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అల్లు అర్జున్ కొత్త లుక్‌లో కనిపిస్తాడని తెలిసింది. వచ్చే సమ్మర్ కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తారట.