ఈ పాత్ర నాకు ప్రత్యేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, సమంత, సీరత్‌కపూర్ ప్రధాన పాత్రల్లో ఓంకార్ దర్శకత్వంలో పి.వి.పి సినిమా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై తెరకెక్కిన చిత్రం ‘రాజుగారి గది-2’. ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతున్న సందర్భంగా ఇందులో హీరోయిన్‌గా నటించిన సీరత్‌కపూర్ చెప్పిన విశేషాలు..
నచ్చిన పాత్ర
ఈ చిత్రంలో నాది మంచి పాత్ర, పాత్ర గురించి చెబితే సినిమా కథ తెలిసిపోతుంది. కానీ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తాను. అదేమిటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఓంకార్ కథ చెప్పినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇంత మంచి పాత్ర వచ్చినందుకు ఆనందంగా వుంది.
నాగార్జునతో
నాగార్జునలాంటి స్టార్‌తో నటించడం మర్చిపోలేని అనుభూతి. ఆయన అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా లొకేషన్‌లో చాలా సరదాగా వుంటారు. నటన విషయంలో చాలా సలహాలు ఇచ్చారు. ఎలా వుండాలి ఎలా చేయాలి అన్న విషయాలు ఆయన ద్వారా తెలుసుకోగలిగాను. నిజంగా ఇలాంటి ఛాన్స్ దక్కినందుకు వెరీ హ్యాపీ.
కావాలనే గ్యాప్
సుమంత్ అశ్విన్‌తో చేసిన ‘వాస్కోడిగామా’ సినిమా తరువాత తెలుగులో చేయాలా వద్దా అని అనుకున్నాను. నిజానికి అంతకుముందు చేసిన టైగర్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. దాంతో మంచి పాత్రలు వస్తే తప్ప చేయవద్దని అనుకున్నాను. అలా ఆరు నెలలు గడిచాక ఈ అవకాశం దక్కింది. నిజంగా ఈ సినిమాతో నాకు మరింత మంచి గుర్తింపు లభిస్తుంది.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాను. దాంతోపాటు క్షణం దర్శకుడు రవికాంత్ పేరేపు సినిమా ఒకటి, అలాగే రవితేజతో ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటిస్తున్నాను.

- శ్రీ