అమర్ అక్బర్ ఆంథోని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో నటించిన రవితేజ, మరోవైపు ‘టచ్ చేసి చూడు’ సినిమాలో కూడా నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలతో కెరీర్ పరంగా వెనుకబడిన రవితేజ, ‘రాజా ది గ్రేట్’తో విజయాన్ని అందుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతోపాటు తాజాగా మరో చిత్రానికి ఓకె చెప్పాడని తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని, మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. భారీ ప్రయోగాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని, తాజాగా అమర్ అక్బర్ ఆంథోని పేరును చాంబర్‌లో రిజిష్టర్ చేయించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇందులో రవితేజ మూడు పాత్రల్లో కనిపిస్తాడా లేదా మూడు గెటప్‌లలో వుంటాడా అనేది ఆసక్తిని పెంచుతోంది. వెంకీ, దుబాయ్ శీను చిత్రాల తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.