18న విజయ్ అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్ స్టార్ విజయ్, సమంత, కాజల్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా అట్లీ దర్శకత్వంలో తేన్నాండాల్ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘అదిరింది’. తమిళ్‌లో ‘మెర్సల్’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 18న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మురళి రామస్వామి మాట్లాడుతూ- శరత్ మరార్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఇప్పటికే భారీ అంచనాలతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా లక్షల వ్యూస్‌ను అందుకున్నాయి. విజయ్ లుక్ బాగుందని అంటున్నారు. దాంతోపాటు అట్లీ దర్శకత్వం అద్భుతంగా వుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుకగా 18న విడుదల చేస్తున్నామన్నారు. శరత్ మరార్ మాట్లాడుతూ- విజయ్ 61వ చిత్రమిది. తేన్నాండాల్ స్టూడియోస్‌తో కలిసి ఈ సినిమా నిర్మించడం ఆనందంగా వుంది. ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఇది. రాజారాణి, తేరి వంటి సినిమాలతో దర్శకుడు అట్లీ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి-2, కబాలి తరువాత ఆ రేంజ్‌లో ప్రదర్శించబడుతున్న చిత్రమిది అన్నారు. ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, కెమెరా: జి.కె.విష్ణు, ఎడిటింగ్: రూబన్, నిర్మాతలు: మురళీ రామస్వామి, హేమా రుక్మిణి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: అట్లీ.