జనవరి నుంచి కొత్త చిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైలవకుశ’ సినిమాతో కొత్త ఉత్సాహంతో ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి వసూళ్లతోపాటు నటుడిగానూ ఆకాశానికి ఎత్తేసింది. ఏకంగా మూడు పాత్రల్లో నటించి అదరగొట్టిన ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ చిత్రం క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌తో రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరిలో సెట్స్‌పైకి రానున్నదట. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఎన్టీఆర్‌తో చేసే సినిమా షూటింగ్ మొదలుపెడతాడట. ఇందులో ఎన్టీఆర్ మిలటరీ అధికారిగా కనిపిస్తాడంటూ వార్తలొస్తున్నాయి. కానీ ఆయన ఆర్మీ అధికారి కాదని, త్రివిక్రమ్ స్టైల్ లో వుండే కథానాయకుడిగానే కనిపిస్తాడని, ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలతో ఈ చిత్రం వుంటుందట. ఇందులో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్, అమీ జాక్సన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి! ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడే అవకాశం వుంది.