బికినీకి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ సరసన ‘సరైనోడు’ సినిమా తరువాత హీరోయిన్ కేథరిన్ క్రేజ్ మారిపోయింది. అంతకుముందు పలు చిత్రాలు చేసినా కూడా పెద్దగా పాపులారిటీ దక్కని ఈమెకు ఆ సినిమాలో ఎంఎల్‌ఏ పాత్రతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా తరువాత ఈ భామకు అవకాశాలు క్యూ కట్టాయి. అటు తమిళంలో కూడా మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఇటీవలే రాణా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’తో మరో విజయాన్ని అందుకున్న కేథరిన్ తాజాగా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో ఘనవిజయం సాధించిన బోగన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో చాలామంది పేర్లు పరిశీలించినప్పటికీ ఫైనల్‌గా కేథరిన్‌ని ఎంపిక చేశారట. గ్లామర్‌తోపాటు నటనతో ఆకట్టుకునే ఈ భామ, ఇందులో బికినీ కూడా వేస్తుందని తెలిసింది. ఇదివరకే బికినీలో ఆకట్టుకున్న కేథరిన్ గ్లామర్ విషయంలో ఓ అడుగు ముందే వుంది. బోగన్‌లో తన అందాలతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.