అజ్ఞాతవాసి అవుతాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూర్‌ప్‌లో జరగనుంది. దానికోసం చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్లింది. అక్కడ పాటలతోపాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలైన చాలా రోజులే అవుతున్న ఇంకా టైటిల్‌ని ఖారారు చేయలేదు. దీపావళికి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వార్త తెగ ఆసక్తిరేపుతోంది. అదేమిటంటే సినిమాలో బాషా రేంజ్‌లో పవన్‌కు ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఓ భారీ ట్విస్ట్‌తో ఈ సినిమా సాగుతుందని టాక్? పైగా సినిమా టైటిల్ కూడా అజ్ఞాతవాసి అని పెట్టే ఆలోచనలో వున్నాడు త్రివిక్రమ్. నిజంగా బాషా రేంజ్‌లో అయితే అది మెగా ఫ్యాన్స్‌కు పెద్ద పండగే అని చెప్పాలి. ఎందుకంటే బాషా సినిమా ఏ రేంజ్‌లో హిట్టో అందరికీ తెలుసు. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే జనవరి 10న విడుదల కానుంది.