‘డిటెక్టివ్’గా విశాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ హీరో విశాల్, అను ఇమ్మాన్యుయేల్, ఆండ్రియా ముఖ్యపాత్రల్లో మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిటెక్టివ్’. తమిళంలో ‘తుప్పరివాలన్’ పేరుతో విడుదలై ఘనవిజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హరి పిక్చర్స్ పతాకంపై హరి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు లింగుస్వామి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత హరి వివరాలు తెలియజేస్తూ- తుప్పరివాలన్ పేరుతో తమిళంలో విడుదలై మొదటవారంలోనే 30 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని విశాల్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని ‘డిటెక్టివ్’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం. తాజాగా విడుదలైన ట్రైలర్ తప్పకుండా మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలో ప్రసన్న, కె.్భగ్యరాజ్, సిమ్రన్, జాన్, విజయ్, అభిషేక్ శంకర్, జయప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.