హౌరాబ్రిడ్జిపై లలీ జర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ ముఖ్యపాత్రల్లో రేవన్ యాదూ దర్శకత్వంలో ఇ.ఎం.వి. స్టూడియో పతాకంపై వడ్డేపల్లి సత్యనారాయణ సమర్పణలో తెరకెక్కిన ‘హౌరాబ్రిడ్జి’ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శకుడు రేవన్ యాదూ మాట్లాడుతూ- గోడ, బ్రిడ్జి ఒకే మెటీరియల్‌తో తయారవుతాయి. కానీ గోడ విడదీస్తే బ్రిడ్జి కలుపుతుంది. అదే కానె్సప్టుతో తెరకెక్కిన హాట్ టచింగ్ ఎమోషనల్ డ్రామా ఇది అన్నారు. హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ- ఇదొక లలీ జర్నీ. సినిమా బాగా వచ్చింది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. చాందినీ చౌదరి మంచి టాలెంట్ వున్న అమ్మాయి. తప్పకుండా ఈ సినిమా మాకు మంచి బ్రేక్‌నిస్తుంది అన్నారు. హీరోయిన్ చాందినీ మాట్లాడుతూ- ఎమోషనల్‌గా సాగే జర్నీ ఇది. దర్శకుడితో పనిచేయడం మంచి అనుభూతి. తప్పకుండా నాకు మంచి గుర్తింపు వస్తుంది అన్నారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ- ఈ చిత్రంలో నాలుగు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. త్వరలోనే పాటలను విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజు, కథ, దర్శకత్వం: దేవన్ యాదూ.