వెంకీతో దేవసేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనదైన సత్తా చాటుకున్న అనుష్క, బాహుబలి తరువాత ప్రస్తుతం భాగమతి చిత్రంలో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. జనవరిలో విడుదల కానున్న ఈ సినిమా తరువాత అనుష్క మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. బాహుబలి కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించిన అనుష్క మధ్యలో సింగం-3, సైజ్ జీరో చిత్రాలు మాత్రమే చేసింది. ప్రస్తుతం ప్రేక్షకులకు దూరంగా వున్నానని ఫీలైన అనుష్క, ఇకపై స్పీడుగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది. దానికోసం స్లిమ్‌గా మారేందుకు కసరత్తులు చేస్తోంది. అనుష్క తదుపరి చిత్రం వెంకటేష్‌తో నటించేందుకు రెడీ అయింది. తేజా దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించే చిత్రంలో అనుష్కను ఎంపిక చేయనున్నారట. గతంలో వెంకటేష్‌తో కలిసి ‘చింతకాయల రవి’ చిత్రంలో నటించింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం నవంబర్‌లో మొ దలయ్యే అవకాశం వుంది.