లక్కీ చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ రెజీనా కసాండ్రాకు ఈమధ్య కాస్త బ్రేక్ పడింది. గ్లామర్ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో వున్న ఈమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న నక్షత్రం ఫ్లాప్ అవ్వడంతో పాపం రెజీనా ఆశలు నిరాశలయ్యాయి. ప్రస్తుతం తమిళ్‌లో ఓ చిత్రంలో నటిస్తున్న ఈమెకు క్రేజీ అవకాశం దక్కింది. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ చిత్రం కర్ణలో రెండవ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందట. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. ఆమెతోపాటు నటాషా దోషి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇందులో మరో హీరోయిన్ పాత్ర వుందని, ఆ పాత్ర కథకు కీలకం అవ్వడంతో రెజీనాను ఎంపిక చేశారట. రెజీనా బాలయ్యతో నటించడమే కాదు పాట కూడా చేస్తోందట. మరి ఈ సినిమా తరువాత రెజీనాకు టాలీవుడ్‌లో క్రేజ్ ఏ రేంజ్‌లో పెరుగుతుందో చూడాలి!