మరో విక్రమార్కుడవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రం రాజా దిగ్రేట్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాటల్ని విడుదల చేసారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం అందించాడు, పాటలు బాగా వచ్చాయి, ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు అందరూ కష్టపడ్డారు, రాజేంద్రప్రసాద్, రాధిక లాంటి సీనియర్లతో పనిచేయడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను, నిర్మాతలు చాలామంది వుండొచ్చు కానీ మేకర్స్ తక్కువమంది వుంటారు, అలా దిల్‌రాజు మంచి మేకర్, అతన్నిచూస్తే సక్సెస్, జడ్జిమెంటు కనిపిస్తాయి, అనిల్ అద్భుతంగా తెరకెక్కించాడు అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ సినిమా అనుకున్నదానికంటే బాగా వచ్చింది, రవితేజతో ఇరవై ఏళ్ల పరిచయం, ఆర్య స్క్రిప్ట్ ముందు తనకే వినిపించాం, కథ బాగుంది కానీ నాతో కాకుండా వేరేవాళ్లతో చేయండి అని సల హా ఇచ్చాడు, రాజా ది గ్రేట్‌లో రవితేజ అద్భుతంగా నటించాడు, ఈ సినిమాలో హీరోకి కళ్లు వస్తాయా అన్న విషయం చాలామంది అడుగుతున్నారు, కానీ సినిమా మొత్తం ఆయన బ్లైండ్‌గానే కనిపిస్తాడు, తెలుగు సినిమాల్లో హీరో సినిమా అంతా బ్లైండ్‌గా కనిపించే సినిమా ఇదే అవుతుంది. రవితేజకు ఇడియట్, విక్రమార్కుడి తరహాలో మరో మంచి సినిమా అవుతుంది అన్నారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ సుప్రీం తరువాత నేను చేయబోయే సినిమా ఎలా వుండాలో అని దిల్‌రాజుతో చర్చించాను, ఏదైనా కొత్తగా ట్రై చెయ్యమని చెప్పారు, దాంతో బ్లైండ్ పాత్ర ఐడియా వచ్చింది, ఈ కథను విని వెంటనే ఓకే చేసిన రవితేజకు ప్రత్యేక కృతజ్ఞతలు, ఆయనిచ్చిన సపోర్టు, ఎనర్జీతో సినిమా మరో లెవెల్‌కి చేరింది అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మెహరీన్, రాజేంద్రప్రసాద్, శ్రీనివాసరెడ్డి, సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.