మూడు భాషల్లో ఏంజెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగఅనే్వష్, హెబ్బాపటేల్ జంటగా శ్రీ సరస్వతి ఫిలింస్ పతాకంపై బాహుబలి పళని దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన చిత్రం ‘ఏంజెల్’. సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 3న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలు స్నోవైట్ అండ్ ది హంట్స్‌మెన్, థార్, ఎవెంజర్స్ వంటి సినిమాలకు గ్రాఫిక్స్ అందించిన నిపుణుల పర్యవేక్షణలో ఈ చిత్రానికి గ్రాఫిక్స్ చేయించాం. దాదాపు 45 నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఉంటుంది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తెలుగులో నవంబర్ 3న భారీగా విడుదలవుతోంది. ఆ తరువాత వారం రోజులకు హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తాం అన్నారు. దర్శకుడు పళని మాట్లాడుతూ- కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నాగఅనే్వష్, హెబ్బాపటేల్‌ల నటన ఆకట్టుకుంటుంది అన్నారు. హీరో నాగ అనే్వష్ మాట్లాడుతూ- ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. భీమ్స్ అందించిన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది అన్నారు. హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ- అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నేను ఏంజెల్‌గా కనిపిస్తాను. నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. అన్ని రకాల ఎమోషన్స్ వున్న సినిమా. తప్పకుండా మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:్భమ్స్, కెమెరా:గుణ, నిర్మాత:్భవనసాగర్, దర్శకత్వం:బాహుబలి పళని.