రంగస్థలంలో చరణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ 1985 చిత్రం హైదరాబాద్‌లో వేసిన విలేజ్ సెట్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1985 నేపథ్యంలో రంగస్థలం అనే ఊరిలో జరిగిన కథగా ఉంటోందట. ఇప్పటికే భారీ అంచనాల్ని రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటో ల్ని చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అచ్చంగా ఆ కాలంనాటి వస్తువులతో, పరిస్థితులతో వేసిన సెట్ అద్భుతంగా వుందని, ముఖ్యంగా చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తుచేస్తోందని కామెంట్ పెట్టాడు. చరణ్ పెట్టిన ఫొటో చూస్తే నిజంగా ఆ జ్ఞాపకాలు మనల్ని కూడా వెంటాడుతాయి. పూరిగుడిసెలు, గోలీసోడా, గోల్డ్‌స్పాట్ కూల్‌డ్రింకులు, లాంతర్లు లాంటి చాలా వస్తువులు ఈ సెట్‌లో కనిపిస్తాయట. సినిమా చూస్తున్నంతసేపు ఆ కాలానికి వెళ్లిపోతారని అంటున్నాడు. శరవేగంగా షూటింగ్‌ను పూర్తిచేసి సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా క్రేజీగానే జరుగుతోంది.