హాలీవుడ్ స్థాయిలో లండన్ లైఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసద్‌షాన్, యాంబర్‌రోజ్ జంటగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లండన్ లైఫ్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా ఫిలిమ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు నవీన్ మేడారం మాట్లాడుతూ, హాలీవుడ్‌లో 30 సినిమాలకు పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించానన్నారు. ఇండియానుండి లండన్‌కు వెళ్లిన 9 మంది అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుందని, ఆ సమయంలో వాళ్లకెదురైన సమస్యలేమిటి? అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా పూర్తిగా లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందన్నారు. ఈ చిత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుందని, అభిషేక్ పిక్చర్స్ ద్వారా విడుదల చేస్తున్నామన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ, నవీన్ రూపొందించిన ఈ సినిమా మంచి ఎమోషనల్ డ్రామా అని, హైదరాబాద్‌లో 33 మల్టీఫ్లెక్స్‌లతోపాటు, ఎ.పి, తెలంగాణా, ఓవర్సీస్‌లోకూడా ఈ సినిమా విడుదల చేస్తున్నామన్నారు. సిద్ధార్థ మాట్లాడుతూ.. కథ బాగా నచ్చిందని, మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది అన్నారు.