3న గరుడవేగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీస్ అధికారిగా మరోసారి తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించడానికి హీరో రాజశేఖర్ ‘పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం’ చిత్రంతో మరోసారి రానున్నాడు. జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రవీణ సత్తార్ దర్శకత్వం వహించారు. కోటేశ్వరరాజు నిర్మించిన ఈ చిత్రంలో పూజాకుమార్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సా ర్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కోటేశ్వరరాజు మాట్లాడుతూ- ఓ సిన్సియర్ ఎన్‌ఐఎ అధికారి దేశం కోసం, తన కుటుంబం కోసం చేసిన పోరాటం ఈ చిత్రం లో సరికొత్తగా దర్శకుడు తెరకెక్కించారని, రాజశేఖర్ స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను అలరిస్తారని తెలిపారు. శ్రద్ధాదాస్ పరిశోధన చేసే పాత్రికేయురాలిగా నటించిందని, సాంకేతిక నిపుణులతోపాటుగా భారీ తారాగణంతో హైటెక్నికల్ విలువలతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. సెన్సార్ వారు యు/ఎ సర్ట్ఫికెట్ అందించారని, నవంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని ఆయన అన్నారు. సన్నీలియోన్, ఆదిత్, నాజర్, కిశోర్, ఆదర్శ్, రవిరాజ్, శతృ తదితరులు నటించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, అలీ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: అంజి, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, నిర్మాత: కోటేశ్వరరాజు, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.