సమ్మర్ స్పెషల్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి ప్రొడక్షన్ నెం.3గా నిర్మిస్తున్న భారీ చిత్రం షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ- నవంబర్ 7 వరకు హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుంది. నవంబర్ 22 నుంచి ఔట్‌డోర్ షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. మహేష్ - కొరటాల శివ కాంబినేషన్‌లో మా బ్యానర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మహేష్ కెరీర్‌లోఇది మరో సూపర్‌హిట్ చిత్రం అవుతుంది. అలాగే మా బ్యానర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. సూపర్‌స్టార్ మహేష్, హీరోయిన్ కైరా అద్వానీ, ప్రకాష్‌రాజ్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, కెమెరా: రవి కె.చంద్రన్, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.