పవన్ బాటసారి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనుంది. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటివరకూ టైటిల్‌ను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్‌కే ఫిక్స్ అవుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ మారిందంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఫిలిం చాంబర్‌లో బాటసారి అనే టైటిల్‌ను యూనిట్ రిజిష్టర్ చేయించిందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కథ ప్రకారం ‘బాటసారి’ అనే టైటిల్ పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకే నిర్మాతలు ఈ టైటిల్‌ను రిజిష్టర్ చేయించారని టాక్. నవంబర్ 7న టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా తరువాత పవన్ కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్, ఎ.ఎం.రత్నం నిర్మాతగా నేసన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతోపాటు మరో క్రేజీ దర్శకుడు క్రిష్ కూడా పవన్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పవన్‌కోసం మంచి కథను సిద్ధం చేశాడట క్రిష్. హిందీలో మణికర్ణిక చిత్రాన్ని రూపొందిస్తున్న క్రిష్, తదుపరి చిత్రం పవన్‌తోనే చేస్తాడట. వచ్చే ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పవన్, మరి ఈ సినిమాలు చేస్తాడా లేదా అనేది తెలియాల్సి వుంది.