నచ్చితేనే గ్లామర్ పాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో తెరకెక్కించారు. ‘ప్రేమమ్’ టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలతో బిజీగా మారిన అనుపమ, తాజాగా నటించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో ఇంటర్వ్యూ..
* రెస్పాన్స్ ఎలా వుంది?
- చాలా ఆనందంగా వుంది. నేను గతంలో పనిచేసిన దర్శకులు, హీరోలు నా పాత్ర బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకూ నేను ఎన్నో పాత్రలు చేసినా కూడా ఈ చిత్రంలోని ‘మహా’ పాత్ర నాకు చాలా నచ్చింది. నా నిజ జీవితానికి పూర్తి వ్యత్యాసంగా ఉన్న పాత్ర అది.
* కథ చెప్పినపుడు ఎలా అన్పించింది?
- దర్శకుడు కిశోర్ కథ చెప్పినపుడు బాగా నచ్చింది. కానీ మహా పాత్ర మధ్యలోనే కనుమరుగు అవుతుందని చెప్పడం షాక్‌కు గురిచేసింది. అయినా సినిమా మొదటి భాగంలో ప్రాముఖ్యత ఉండడంతో ఇలాంటి మంచి పాత్ర మళ్లీ రాదనే ఉద్దేశ్యంతో చేశాను. నిజంగా ఇలాంటి పాత్రలు రావడం లక్కీ.
* కెరీర్ ఎలా ప్రారంభమైంది?
- నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని. సినిమాకు సంబంధించిన వారెవరూ మా ఫ్యామిలీలో లేరు. కానీ నాకు సినిమాలంటే ఇష్టం. సినిమాల్లోకి రావాలనే కోరికతో ప్రయత్నం చేశాను. అప్పుడే ప్రేమమ్ అవకాశం వచ్చింది. నిజంగా ఇదంతా దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను.
* సినిమా ఎంపికలో కథకా లేదా పాత్రకు ప్రాముఖ్యం ఇస్తారా?
- ఖచ్చితంగా కథ బాగుండాలి. కథ బాగుంటే తప్పకుండా పాత్ర కూడా బాగుంటుందని నా ఉద్దేశ్యం. అలాగే పాత్ర విషయం కూడా ఆలోచిస్తా.
* గ్లామర్ పాత్రలు చేయరా?
- అలా అని ఏం లేదు. గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధమే. కానీ అది కథలో భాగంగా రావాలి. ఒకవేళ ఆ పాత్ర గ్లామర్‌లో కనిపించాలని నన్ను ఒప్పించగలిగితే తప్పకుండా చేస్తా.
* రామ్ గురించి?
- రామ్ చాలా ఎనర్జిటిక్ వున్న పర్సన్. సెట్‌లో అతని స్పీడ్ చూస్తుంటే చాలా ఆసక్తి కలుగుతుంది. తను ఎంతో సపోర్టు అందించాడు. అలాగే రామ్ మంచి వ్యక్తిత్వం వున్న మనిషి.
* దర్శకుడు కిశోర్ గురించి?
- కిశోర్ చాలా మంచి వ్యక్తి. సెట్‌లో కూల్‌గా వుంటాడు. తనకు కథపై మంచి కమాండింగ్ వుంటుంది. తనతో పనిచేయడం ఆనందాన్నిచ్చింది.
* ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?
- చాలామంది ఉన్నారు. నాతోటి హీరోయిన్స్ అందరితో టచ్‌లో ఉంటాను. ముఖ్యంగా అయితే శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్. ఇక రియల్ లైఫ్‌లో అయితే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు.
* మలయాళంలో సినిమాలు చేయడంలేదా?
- ఇక్కడ వరుసగా సినిమాలు చేస్తుండడంతో కుదరడంలేదు. ప్రస్తుతానికి కథలయితే వస్తున్నాయి. త్వరలోనే చేస్తా.
* లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తారా?
-నాక్కూడా అలాంటి సినిమా చేయాలని వుంది. తప్పకుండా మంచి కథ దొరికితే చేస్తా. భిన్నమైన పాత్రల్లో నటించాలని వుంది.
* తదుపరి చిత్రాలు?
- ప్రస్తుతం నాని హీరోగా మేర్లపాక గాంధి దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’, సాయిధరమ్, కరుణాకరన్‌ల సినిమా ఒకటి, దాంతోపాటు మరో సినిమా ఉంది.

-శ్రీ