కొత్తవాళ్లను ప్రోత్సహించాలని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలుపెట్టి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు బన్నీ వాసు. అల్లు అర్జున్‌పై వున్న అభిమానంతో బన్నీ వాసుగా మారాడు. అటుపై గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా ఆది, వైభవి, రష్మి ముఖ్యపాత్రల్లో నటుడు ప్రభాకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4 మూవీస్ పతాకంపై ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 3న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత బన్నీవాసు చెప్పిన విశేషాలు..
కొత్త తరహాలో..
ఇది హర్‌ర్ థ్రిల్లర్ చిత్రమైనా రెగ్యులర్ సినిమాలా కాకుండా భిన్నంగా వుంటుంది. ఇది మలయాళ చిత్రానికి రీమేక్. అయితే తెలుగు నేటివిటీ కోసం చాలా మార్పులు చేశాం. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే వుంటుంది.
ముందు వేరే కథ
నిజానికి గీతా ఆర్ట్స్, యు.వి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌ల కలయికలో వి4 మూవీస్‌ను ప్రారంభించాం. ఈ బ్యానర్ ద్వారా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నాం. ఆ సమయంలో దర్శకుడు ప్రభాకర్ ఓ కథ విన్పించాడు. కథ నచ్చింది కానీ అదే సమయంలో మలయాళ సినిమా చూడడం, సిని మా నచ్చడంతో రీమేక్ చేస్తే బెటర్ అని ప్రయత్నం చేశాం. ప్రభాకర్ కూడా అద్భుతంగా తెరకెక్కించాడు. తనకు గతంలో ప్రొడక్షన్ అనుభవం వుంది కాబట్టి సినిమా బాగా వచ్చింది.
నటీనటుల గురించి
ఈ కథ ప్రకారం ఆది అయితేనే బావుంటుందనిపించింది. ఆది కూడా అనుకున్నదానికంటే అద్భుతంగా నటించాడు. అలాగే వైభవి, రష్మిల నటన, గ్లామర్ ఆకట్టుకుంటుంది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా విషయంలో అల్లు అరవింద్ సలహాలు, సూచనలు తీసుకున్నాం.
నా గురించి
నాది పాలకొల్లు. స్టడీ అంతా అక్కడే జరిగింది. గ్రాడ్యుయేషన్ అయిపోగానే సినిమాల్లోకి రావాలన్న ఆలోచన కలిగింది. అక్కడే మారుతితో పరిచయం. తరువాత అల్లు అర్జున్‌తో పరిచయం పెరిగి అనుబంధం ఏర్పడింది. ఆర్య సమయంలో షూటింగ్‌లో ఇద్దరు వాసులు ఉండడంతో నన్ను బన్నీ వాసు అని దిల్ రాజు పిలవడంతో అదే కంటిన్యూ అయింది. డిస్ట్రిబ్యూటర్‌గా పలు చిత్రాలు విడుదల చేశాం.
బన్నీతో
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో తెరకెక్కిస్తున్న ‘నా పేరు సూర్య..’ చిత్రం ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నాం. అలాగే వి4 బ్యానర్‌లో కొత్తవాళ్ళను పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్నది నా డ్రీమ్.