పక్కా లోకల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లితెర 45మంది కళాకారులతో మొట్టమొదటిసారిగా జానపద ఆటపాటల కార్యక్రమాన్ని విక్రమ్ ఆర్ట్స్ సమర్పణలో మేము పక్కా లోకల్, దద్దరిల్లే జానపదం అనే క్యాప్షన్‌తో విక్రంరెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పోస్టర్‌ను ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విక్రమ్‌ను, శ్రీ్ధర్‌రెడ్డిని అభినందిస్తున్నాను. మేము లోకల్ అని చెప్పుకోవడానికి 50 ఏళ్ళు పట్టింది. తెలంగాణ కళాకారులను నిలబెట్టడానికి గతంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. విక్రం ఆదిత్య మాట్లాడుతూ- మరుగున పడుతున్న జానపద పాటలను మళ్లీ వెలుగులోకి తీసుకురావడానికి చేస్తున్న కార్యక్రమం ఇది అన్నారు. నిర్మాత శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ- జానపదాలు బతకాలనే ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం కావాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో నటి జ్యోతిరెడ్డి, అనూష, శ్రీవాణి, దర్శకుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.