ఈ నగరానికి ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికీ బాగా పరిచయం. ఎందుకంటే ఏ థియేటర్‌లోనైనా సినిమాకు ముందు వచ్చే కేన్సర్ యాడ్‌లోని డైలాగ్ ఇది. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి అంటూ వచ్చే డైలాగులోని మొదటి పదాన్ని తన చిత్రానికి టైటిల్‌గా పెట్టేందుకు ప్రముఖ నటుడు వెంకటేష్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గురు సినిమా తరువాత ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తోంది. క్యాచీగా వుండే టైటిల్ కావడంతో సినిమాకు మంచి ప్లస్ అవుతుందని దర్శకుడు తేజ భావిస్తున్నాడట. నవంబర్ 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వెంకటేష్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.