నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీ్ధర్ రూపొందిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ చిత్రంతో కథా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ నవంబర్ 5 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా జరగనుంది. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలతోపాటుగా యాక్షన్ ఫైట్స్ చిత్రీకరించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 27న విడుదల చేయడానికి నిర్ణయించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- విశాల్ శేఖర్ అందిస్తున్న సంగీతం హైలెట్‌గా వుంటుందని, భారీ తారాగణంతోపాటుగా సాంకేతిక నిపుణులు కూడా రాజీపడకుండా ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. బన్నీ కెరీర్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం కంప్లీట్ ప్యాకేజీతో వస్తోందని చిత్ర సమర్పకులు నాగబాబు తెలిపారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌తో చాలా సంతోషంగా ఉన్నామని నిర్మాత బన్నీ వాసు అన్నారు. అర్జున్, శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్ శేఖర్, రచన, దర్శకత్వం: వక్కంతం వంశీ.