‘ఖుషీ’గా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ గ్లామర్ భామ పరిణితీ చోప్రా ప్రస్తుతం భలే ఖుషీ మీదుంది. దానికి కారణం ఆమె తాజాగా నటించిన ‘గోల్‌మాల్ ఎగైన్’ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు, అందులో తన పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఈ ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ విజయంతో చాలా ఆనందం కలుగుతోంది. అందరూ ఖుషీ పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారంటూ తెగ మురిసిపోతోంది. నిజానికి పరిణితికి చాలా అవకాశాలు వస్తున్నా కూడా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే హీరోయిన్‌గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకోవాల్సిన ఈ భామ కావాలనే ఇలా కెరీర్‌ను పాడుచేసుకుంటోందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. వస్తున్న మంచి అవకాశాలను అందిపుచ్చుకుని క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోవాలని సలహాలు ఇస్తున్నారు అభిమానులు. అందుకే ఆమె కూడా ఇకపై వరసగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నానని చెబుతోంది.