దేశం గర్వపడేలా సైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. డిసెంబర్‌నుండి సెట్స్‌పైకి వచ్చే ఈ చిత్రం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. భారీ తారాగణంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం దిశగా దర్శకుడు సురేందర్‌రెడ్డి రాయలసీమలోని రూపాంగుడి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేసారు. దేశం గర్వపడే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని చెప్పారు. నయనతార, అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబులాంటి కీలక నటీ నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిరంజీవి కెరీర్‌లో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.