ఎన్టీఆర్ బయోపిక్‌లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు నందమూరి తారకరామరావు జీవిత కథతో ఆయన తనయుడు బాలకృష్ణ నటించే చిత్రం త్వరలో మొదలుకానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. అదేంటంటే ఇందులో నందమూరి కల్యాణ్‌రామ్ కూడా నటిస్తున్నాడట. కల్యాణ్‌రామ్ హరికృష్ణ పాత్రలో కనిపిస్తాడని తెలిసింది. మొత్తానికి నందమూరి అభిమానులకు ఆనందం కలిగించే విషయం ఇది. దాంతోపాటు చంద్రబాబు పాత్రకోసం జగపతి బాబును అనుకుంటున్నారట. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సినీ రాజకీయ రంగాల్లో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.