దిల్ వుంటే చాలు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
త్రిరాస్ ప్రణామ్ ఆర్ట్స్ పతాకంపై రాజేష్ పత్తి, శే్వత జంటగా అమృతా శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం కొంచెం దిల్ వుంటే చాలు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ రచయిత మరుదూరి రాజా క్లాప్ కొట్టగా సురేష్ కెమెరా స్విచాన్ చేసారు. అనంతరం మరుదూరి రాజా మాట్లాడుతూ, హారర్, కామెడీ జోనల్‌లో తెరకెక్కే సినిమా ఇది. ప్రస్తుతం వస్తున్న కొత్తవారంతా మంచి టాలెంట్, కమిట్‌మెంట్‌తో వస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి వాళ్లకు మంచి పేరు తేవాలన్నారు. దర్శక, నిర్మాత- శ్రీరామ్ మాట్లాడుతూ, నిన్ను చూడగానే సినిమా తర్వాత చేస్తున్న రెండో చిత్రమిది. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌గా వుంటుంది. హారర్‌తోపాటు కామెడీ, లవ్ లాంటి అంశాలు కలగలిసి వుంటాయి. ఇందులో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు వుంటారు. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి శివరాత్రి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, కెమెరా: మోహన్‌సాగర్, నిర్మాత: అమృతాపూరీ శ్రీరామ్, దర్శకత్వం: శ్రీరామ్.