గరుడవేగ’ ఓ సంచలనమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగ్రీ యంగ్‌మెన్‌గా టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని అటుపై విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ స్టార్‌గా మారాడు రాజశేఖర్. కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పిఎస్‌వి గరుడ వేగ 126.18 ఎఎమ్’. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో పూజాకుమార్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 3న విడుదలవుతున్న సందర్భంగా హీరో రాజశేఖర్‌తో ఇంటర్‌వ్యూ...
* హీరోగా చాలా గ్యాప్ వచ్చింది.?
వరుస పరాజయాలతో టెన్షన్ పడ్డ నాకు కొత్త అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకురాలేదు. ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటిస్తారా? అంటూ చాలామంది అడిగారు. కానీ మంచి అవకాశమొస్తే చేద్దామని అనుకున్నా.
* ఈ అవకాశం ఎలా వచ్చింది?
గడ్డం గ్యాంగ్, మహంకాళి సినిమాల ఫ్లాప్‌లతో వున్న నాకు ఓ రోజు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కలిసాడు. మీతో సినిమా చేయాలని వుంది. మీరు నటించిన మగాడు సినిమా నాకు బాగా ఇష్టం. ఆ తరహాలో ఓ సినిమా చేద్దామని ఈ కథ చెప్పాడు. కథ వినగానే బాగా నచ్చింది.
* గరుడవేగ కథేమిటి?
నేను చేసిన సినిమాల్లోకి ఇదే భారీ బడ్జెట్ చిత్రం. ఏకంగా 30 కోట్లు పెట్టి తీసారు. ఇందులో నేను ఇనె్వస్టిగేటివ్ అధికారిగా కనిపిస్తాను. నా వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్‌పై ఈ కథ సాగుతుంది.
* అంత భారీ బడ్జెట్ పెట్టడానికి కారణం?
నిజానికి ఈ సినిమాను ఐదారు కోట్లతో చేయొచ్చు కానీ కథ ప్రకారం భారీగా వెళితేనే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు కాబట్టి అంత బడ్జెట్. గతంలో సినిమాలు తీసి బాగా నష్టపోయాను. ఆ టైమ్‌లో ఈ సినిమాను నిర్మిస్తే మొత్తం పోగొట్టుకున్నట్టే అన్న ఫీలింగ్‌లో వున్నపుడు నిర్మాత కోటేశ్వరరాజును మా నాన్న పరిచయం చేసారు. ఆయనకు కథ నచ్చడంతో సెట్స్‌పైకి వెళ్లింది.
* దర్శకుడు ప్రవీణ్ గురించి..
ఈ కథను నాకు వినిపించి నాతో తీయడానికి సిద్ధమైన ప్రవీణ్ సత్తార్‌తో చాలామంది రాజశేఖర్‌తో సినిమా ఎందుకు చేస్తున్నారని అడిగారట. అంటే నాలుగు సినిమాలు ఫ్లాప్ అవగానే నా పని అయిపోయిందా? నేను పనికిరానా అన్న ఆలోచన కలిగింది. కానీ ప్రవీణ్ అవన్నీ లెక్కచేయక నాతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రవీణ్ ఈ కథను ఫుల్ బౌండ్‌గా సిద్ధం చేసాడు. కథ విన్నప్పుడు ఇంత భారీ సినిమాను తీయగలడా అనిపించింది. కానీ మొదటి రోజు షూటింగ్ తర్వాత తనపై నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా విజయం పూర్తిగా ఆయనకే దక్కుతుంది. చాలా కష్టపడ్డాడు.
* ఈ సినిమా తర్వాత నెగిటివ్ పాత్రలు చేస్తారా?
తప్పకుండా. ప్రస్తుతం నేను నటించిన ‘గరుడవేగ’ సంచలన విజయం సాధిస్తుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ నా ఉనికిని చాటే సినిమా అవుతుంది. అప్పుడు విలన్ అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తా. ఈమధ్య బాలకృష్ణతో కూడా చెప్పాను. ఆయన సినిమాలో విలన్ అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా.
* తదుపరి చిత్రాలు?
ప్రస్తుతానికి ‘గరుడవేగ’ ఓ సంచలనమే. ఈ సినిమా హిట్టయితే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయికదా.

- శ్రీ