బోయపాటి దర్శకత్వంలో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో జరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత మహేష్ ‘ఊపిరి’ ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ జనవరి నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. మాస్, యాక్షన్ చిత్రాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. ఇప్పటికే బోయపాటి మహేష్ కోసం ఓ కథను సిద్ధం చేశాడని, త్వరలోనే వినిపించేందకు సిద్ధమయ్యాడట. ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలిసింది. 14 రీల్స్ బ్యానర్‌తో మహేష్‌కి ప్రత్యేకమైన అనుబంధమున్న నేపథ్యంలో బోయపాటితో సినిమాను రూపొందించేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.